: నేడు వరంగల్ బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
నేడు వరంగల్ జిల్లాలో బంద్ కు అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ఊపందుకున్న నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన హన్మకొండను ప్రత్యేక జిల్లాగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వరంగల్, హన్మకొండ వేరువేరు కాదని, అలాంటప్పుడు రెండు జిల్లాలు చేయడమేంటని అఖిలపక్షం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చారు. వరంగల్ బస్టాండ్ వద్ద అఖిలపక్షం నేతలు ధర్నా చేస్తున్నారు.