: భారత వాయుసేనలో కొత్త అధ్యాయం.. యుద్ధ విమానాల శిక్షణకు సిద్ధమైన మహిళా పైలట్లు
భారత వాయుసేనలో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. ఇప్పటికే వాయుసేనకు ఎంపికై చరిత్ర సృష్టించి మహిళా పైలట్లు యద్ధవిమానాల శిక్షణను తీసుకోనున్నారు. కర్ణాటక బీదర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్(ఏఎఫ్ఎస్)లో హాక్ అడ్వాన్స్‌డ్ జెట్లపై శిక్షణ పొందనున్నారు. ఫ్లైయింగ్ అధికారిణులు భావన కాంత్, అవని చతుర్వేది, మోహన సింగ్‌లు ఇప్పటికే తొలి విడత శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం దుండిగల్‌లో కిరణ్, పిలాటస్ విమానాలపై శిక్షణ తీసుకున్నారు. సూపర్ సోనిక్ విమానాలను నడిపే ముందు అవసరమైన హాక్ అడ్వాన్స్‌డ్ జెట్లపై వీరు ముగ్గిరికి శిక్షణ ఇస్తారు. యుద్ధ విమానాలు నడపడంలో ప్రాథమిక శిక్షణ అనంతరం మహిళా పైలట్లను పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ పంపించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.