: 'ఆరుషి' తల్లికి మూడు వారాల పెరోల్!
కొన్నాళ్ల క్రితం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి తల్వార్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి నుపుర్ తల్వార్ కు మూడు వారాల పెరోల్ లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి వద్దకు వెళ్లేందుకు న్యాయస్థానం పెరోల్ మంజూరు చేసింది. 2008 మేలో 14 ఏళ్ల ఆరుషిని, వాళ్ల ఇంట్లో పనిమనిషి అయిన హేమరాజ్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం ఆమె తల్లిదండ్రులిద్దరినీ దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసింది. కాగా, ఈ హత్య నేపథ్యంలో గత ఏడాది బాలీవుడ్ లో ‘తల్వార్’ పేరుతో సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే.