: రజనీకాంత్ కుమార్తెకు అరుదైన అవకాశం


తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ప్రముఖ నటుడు ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్యకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (యూఎన్‌-విమెన్‌) ఆమెను భారత్‌ లో స్త్రీ, పురుష సమానత్వం, మహిళా సాధికారత ప్రత్యేక సలహాదారుగా నియమిస్తున్నట్టు 'యూఎన్ విమెన్' శాఖ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐశ్వర్య మాట్లాడుతూ, సాధికారత, సమానత్వం కోసం మహిళల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యతో పాటు ధనుష్‌, సౌందర్య రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News