: చిరంజీవి అనుభవం నుంచి అయినా పవన్ కల్యాణ్ నేర్చుకోకపోతే ఎలా?: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి


ఉద్యమాలంటే టికెట్టు కొని మూడు గంటల పాటు ఎంజాయ్ చేసే సినిమాలు కాదనే విషయాన్ని చిరంజీవి పొందిన అనుభవం నుంచైనా పవన్ కల్యాణ్ నేర్చుకోకపోతే ఎలా? అని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో పెట్టాల్సిన ఏపీ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తుంటే నోరు మెదపని పవన్ కల్యాణ్, ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో కోస్తా అభివృద్ధికి కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు. రాయలసీమ వాదాన్ని తొక్కిపెట్టే క్రమంలోనే ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఆడిస్తున్నారని, ఈ నాటకాలపై రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

  • Loading...

More Telugu News