: పీవీ సింధుకు దక్కిన మరో అరుదైన గౌరవం... కమాండెంట్ హోదా ఇవ్వనున్న సీఆర్పీఎఫ్


రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన షట్లర్ పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అతిపెద్ద పారా మిలిటరీ దళం అయిన సీఆర్పీఎఫ్ ఆమెను ప్రచారకర్తగా నియమించింది. త్వరలోనే ఆమెకు కమాండెంట్ హోదా ఇవ్వనుంది. త్వరలో జరిగే సీఆర్ఫీఎఫ్ వేడుకల్లో సింధుకు ఈ హోదా బ్యాడ్జ్ లు అందజేసేందుకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. సింధును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం, కమాండెంట్ హోదా ఇచ్చే విషయమై అంతకుముందే ఆమె అనుమతి తీసుకున్నారు. కాగా, సీఆర్ఫీఎఫ్ లో కమాండెంట్ హోదా ఎస్పీ స్థాయికి సమానం. కమాండెంట్ పరిధిలో దాదాపు వెయ్యిమంది సిబ్బంది ఉంటారు.

  • Loading...

More Telugu News