: సాహసం చేస్తూనే ప్రాణం విడిచాడు


సాహసమంటే ప్రాణం. సాహసమంటే మక్కువ. చివరకు సాహసం చేస్తూనే ప్రాణం విడిచాడు. పశ్చిమబెంగాల్ కు చెందిన శైలేంద్రనాథ్ హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. తన పిలకతో సాహసాలు ఎన్నో చేశాడు. ట్రైన్లు, జీపులు మరెన్నో వాహనాలను లాగాడు. అంతేకాదు, అదే పిలకను తాడుకు తగిలించుకుని గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేసుకున్నాడు. ఈసారి మరింత దూరం అలాగే పయనించి కొత్త రికార్డ్ రాయాలనుకున్నాడు. లక్ష్యం డార్జిలింగ్ జిల్లాలోని తీస్తా నదిపై 1400 మీటర్లు. సగం పూర్తి చేశాడు. ఇంతలో చక్రం మొరాయించింది. ముందుకు జరగట్లేదు. శైలేంద్ర నాథ్ 25 నిమిషాల పాటు ప్రయత్నించాడు. ఆ తర్వాత అతడిలో కదలిక లేదు. సాహసాలంటే ఇష్టపడే శైలేంద్ర గుండెపోటు రావడంతో గాలిలోనే సాహసం చేస్తూనే కన్నుమూశాడు.

  • Loading...

More Telugu News