: నా కొడుకులిద్దరూ హీరోలైనా.. నేను కూడా ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతుండడం నా అదృష్టం: సినీ హీరో నాగార్జున


తన కొడుకులిద్దరూ హీరోలైన తర్వాత కూడా తాను ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతుండడం తన అదృష్టమని అక్కినేని నాగార్జున అన్నారు. ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ రెండోదశలో తాను నటించిన సినిమాలు సంతోషాన్నిచ్చాయన్నారు. తన పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా కెరీర్ లో స్థిరపడ్డాడని, చిన్నబ్బాయి అఖిల్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. తన పిల్లలకు సలహాలిస్తానే తప్పా, వాటిని వాళ్లపై రుద్దనని చెప్పారు. అఖిల్ రెండో సినిమా విషయంలో తాను గైడ్ చేస్తున్నానని నాగార్జున చెప్పారు.

  • Loading...

More Telugu News