: పశ్చిమ బెంగాల్ పేరు మారితే మూడు భాషల్లో ఇలా ఉంటుంది!


పశ్చిమబెంగాల్ రాష్ట్రం పేరు మార్పు తీర్మానానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్ సర్కార్ ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని కేంద్రం కనుక ఆమోదిస్తే ఆ రాష్ట్రం పేరు ఇక, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్, ఇంగ్లీష్ లో బెంగాల్ గా ఉంటుంది. ఈ విషయమై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పు అనేది చరిత్రలో నిలిచిపోతుందని, ఈ రాష్ట్రం పేరును మార్చాలనుకున్న వామపక్ష పార్టీలు నాడు విఫలమయ్యాయని అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం పేరు ఇప్పుడు మారుతుంటే, వామపక్షపార్టీల వాళ్లు అందుకు సహకరించకపోవడం, దీనిని వ్యతిరేకించడం సబబు కాదన్నారు. రాష్ట్రం పేరులో మార్పు జరిగితే కనుక, జాతీయ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు చెప్పుకునే విషయంలో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంటుందని బెనర్జీ అన్నారు.

  • Loading...

More Telugu News