: చిన్న మామయ్యకు బర్త్ డే శుభాకాంక్షలంటూ అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన సుమంత్
ఈరోజు హీరో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన మేనల్లుడు, కథానాయకుడు సుమంత్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. చిన్నమామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలని, నాగార్జున ఎప్పటికీ యువకుడిలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఇంకా మీసాలు కూడా రానప్పటి నాగార్జున, చిన్న పిల్లాడిగా వున్న తనను ఎత్తుకుని ఉన్న ఒక ఫొటోతో పాటు.. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఉన్న తాజా ఫొటోను కూడా సుమంత్ పోస్ట్ చేశాడు.