: చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెడుతున్నారు: బొత్స
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. సీఎం పదవి నుంచి చంద్రబాబు తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తీరుతో నదీజలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఈ కేసుపై సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.