: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించనున్నారు. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు ఆమోదంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని లోపాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.