: ర్యాంప్ వాక్ చేసి భావోద్వేగానికి గురైన కరీనా కపూర్


ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ర్యాంప్ వాక్ చేసిన సందర్భంగా భావోద్వేగానికి గురైంది. ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించి కరీనా కపూర్ ర్యాంప్ వాక్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ క్షణాలు తన జీవితంలో ప్రత్యేకమైనవని కన్నీటితో చెప్పింది. తల్లి కాబోతుండగా ర్యాంప్ వాక్ చేయడం తనకు మరపురాని జ్ఞాపకమని ఆమె తెలిపింది. గతంలో చాలా సార్లు ర్యాంప్ వాక్ చేసినప్పటికీ సవ్యసాచి తయారు చేసిన దుస్తులు ధరించి ర్యాంప్ పై నడవలేదని గుర్తుచేసింది. ఆయన రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేయడం ఇదే తొలిసారని, తనకు సౌకర్యవంతమైన దుస్తులు డిజైన్ చేశారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News