: రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం


రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ స‌మావేశాలు ఎన్ని రోజులు జ‌రుగుతాయ‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మొద‌ట రేప‌టి నుంచి వ‌చ్చేనెల మూడో తేదీ వ‌ర‌కు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఐదు రోజులే స‌మావేశం ఏమిట‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో స‌మావేశాలు మ‌రికొన్ని రోజులు పెంచే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. ఈరోజు సాయంత్రానికి దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశాల్లోనే వ‌స్తుసేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) బిల్లును ఆమోదించ‌నున్నారు.

  • Loading...

More Telugu News