: చంద్రబాబూ! నువ్వేమైనా నిప్పులాంటోడివా?: బొత్స సత్యనారాయణ
నిత్యమూ నిజాయతీపరుడినని చెప్పుకునే చంద్రబాబు, కోట్లాది రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. నేడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, నువ్వేమైనా నిప్పులాంటి వాడివా? అని ప్రశ్నించారు. బాబు నైజం ఏమిటో తెలుగు ప్రజలందరికీ తెలుసునని, పదవి ఉంటే ఏ తప్పు చేసైనా మేనేజ్ చేసుకోవచ్చనే ధైర్యం ఆయనదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన బొత్స, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయని ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.