: ఇక నిఘానేత్రాల నీడలో హైదరాబాద్ పాతబస్తీ.. ఏర్పాటుకు ముందుకొచ్చిన పీజీసీఎల్
హైదరాబాద్‌లో ఎంతో సున్నిత ప్రాంతమైన పాతబస్తీ ఇకపై నిఘా నేత్రాల నీడలో ఉండనుంది. వాటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఎల్ ప్రతినిధులు ముందుకొచ్చారు. హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డితో ఆ కంపెనీ ప్రతినిధులు ఈరోజు ఎంవోయూ కుదుర్చుకున్నారు. సామాజిక బాధ్యతతో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు పీజీసీఎల్ పేర్కొంది. హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు తీసుకురావాలని చూస్తోన్న పోలీసుల ప్రయత్నాలు విజయం సాధించే దిశగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇప్పటికే పలు ఇతర సంస్థలు కూడా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.