: ‘హోదా’ కోసం దీక్ష చేయడానికి నేనూ రెడీ.. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన ముద్రగడ
కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో పలువురు నేతలను కలిసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. అంతేకాదు ఆ దీక్షలో తనకు కూడా చోటిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ కోసం తాను చేస్తోన్న ఉద్యమం కొనసాగుతుందని ముద్రగడ పేర్కొన్నారు. కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చేనెల 11 న రాజమండ్రిలో కాపు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.