: యెమెన్‌లో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి.. 45 మంది మృతి.. మరో 60 మందికి తీవ్రగాయాలు
యెమెన్ వాసులను ఉగ్రదాడుల భయం వీడడం లేదు. ఎంతో కాలంగా భయం గుప్పిట్లోనే బతుకుతున్న వారిపై ఉగ్రవాదులు తరుచుగా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ దేశంలో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. దీంతో దక్షిణ యెమెన్‌లోని ఆడెన్ ప్రాంతంలోని సైనిక శిబిర ప్రాంతం రక్తసిక్తమైంది. దుండగులు జరిపిన ఆత్మాహుతి దాడితో 45 మంది మృతి చెందారు. మరో 60 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.