: బాలీవుడ్‌లోకి వచ్చేటప్పటికి నేను చాలా చిన్నపిల్లని... అప్పట్లో ఏమీ తెలియదు!: కరిష్మా కపూర్


బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్(42) తాను 17 ఏళ్ల వ‌య‌సులోనే సినిమాల్లోకి ప్ర‌వేశించాన‌ని, ఫ్యాషన్ పరంగా ఎన్నో పొరపాట్లు చేశానని చెప్పింది. ముంబ‌యిలో నిర్వ‌హించిన లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016లో మాట్లాడిన ఈ అమ్మ‌డు ఈ సంద‌ర్భంగా తాను ఫ్యాషన్ ని అనుసరించే క్రమంలో చేసిన పొర‌పాట్ల‌ను గురించి త‌న అభిమానుల‌కు తెలిపింది. తాను 17 ఏళ్ల వయసులో సినిమాల్లో ప్ర‌వేశించిన‌ట్లు, త‌న‌క‌ప్పుడు ఫ్యాషన్ గురించి అంత‌గా తెలియ‌ద‌ని ఆమె చెప్పింది. చిన్న వ‌య‌సులోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించడంతో త‌న‌కు తాను ఫ్యాషన్ పరంగా ఎన్నో పొరపాట్లు చేసిన‌ట్లు, అయితే, తాను వేసుకునే డ్రెస్సులను అందరూ మెచ్చుకునేవార‌ని క‌రిష్మా పేర్కొంది. బాలీవుడ్‌లో ప్ర‌వేశించేట‌ప్ప‌టికి తాను చాలా చిన్నపిల్లనని ఆమె తెలిపింది. పాఠ‌శాల‌ నుంచి వచ్చి నేరుగా సినీరంగంలోకి దిగ‌డం, నటించడం త‌నకు సరదాగా అనిపించేదని పేర్కొంది. ఆ వ‌య‌సులో త‌న‌కు అంత‌గా ఏమీ తెలియదని ఆమె చెప్పింది. తాను న‌టిస్తోన్న సినిమాల్లో దర్శకులు, నిర్మాతలు త‌న‌ను ఏ డ్రెస్సులు వేసుకోవాల‌ని సూచించినా అవే వేసుకునేదాన్నని కరిష్మా పేర్కొంది. సినిమా ప‌రిశ్ర‌మ‌తో పాటు తాను కూడా ఎదుగుతూ వచ్చిన‌ట్లు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో తాను ఫ్యాషన్ పరిజ్ఞానం అభివృద్ధి చేసుకున్నాన‌ని, ప్ర‌స్తుతం త‌న శైలిని ప్రేక్ష‌కులు ఇష్టపడుతున్నారని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News