: బ్రసెల్స్‌లో బాంబు దాడి.. తప్పిన పెను ప్రమాదం
బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీలో ఈరోజు తెల్లవారు జామున దుండగులు బాంబు దాడి చేశారు. ఈ సమయంలో ఇనిస్టిట్యూట్‌లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈరోజు తెల్లవారు జామున కారులో దుండగులు దూసుకువచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. కారులో వస్తూనే ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసిరారని పేర్కొన్నారు. ఎంతమంది దుండగులు ఈ దాడికి పాల్పడ్డారో తెలియరాలేదని చెప్పారు. దుండగుల గాలింపు కోసం పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులా? లేక మరెవరైనానా? అనే అంశం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.