: రెండు టచ్ స్క్రీన్లతో ఎల్జీ తాజా స్మార్ట్ ఫోన్ 'ఎక్స్ స్క్రీన్'... ధర రూ. 12,990


ఎప్పుడూ వినూత్నతతో నిండిన స్మార్ట్ ఫోన్లను పరిచయం చేస్తుండే ఎల్జీ తాజాగా సెకండరీ స్క్రీన్ తో కూడిన మిడ్ రేంజ్ ఫోన్ 'ఎక్స్ స్క్రీన్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రభుత్వం సూచించిన విధంగా పానిక్ బటన్ ను సైతం ప్రవేశపెడుతూ విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 12,990. 4.93 అంగుళాల ప్రధాన డిస్ ప్లేకు తోడుగా, 1.76 అంగుళాల హై డెఫినిషన్ ఇన్ సెల్ టచ్ డిస్ ప్లే దీనికి అదనపు ఆకర్షణ. ఎల్లప్పుడూ ఆన్ లో ఉండే ఈ డిస్ ప్లే ద్వారా సమయం, తేదీ, సోషల్ మీడియా, మెయిల్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చివరిగా వాడిన నాలుగు యాప్స్ వివరాలు ఇక్కడ ఉంటాయి కూడా. ప్రధాన స్క్రీన్ జోలికి పోకుండా, కాల్స్ రిసీవ్ చేసుకునే సౌకర్యాన్నీ అందిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ 1.2 జీహెచ్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరీ, 13/8 ఎంపీ కెమెరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News