: రెయిన్‌గన్‌లలో 80 శాతం సబ్సిడీ ఇస్తున్నాం: చిత్తూరు జిల్లా రైతులతో చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు గుడిపల్లి మండలం శెట్టిపల్లిలో వేరుశనగ పంటలను పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. చెరువుల్లో పూడిక తీయాలని, పంట కుంటలు తవ్వాలని చంద్రబాబు అన్నారు. రక్షిత నీటి తడుల గురించి ఆయన వివరించారు. సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. రెయిన్‌గన్‌ల వాడకాన్ని మరింత పెంచాలని సూచించారు. రెయిన్‌గన్, పంట సంజీవని ఉంటే ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. రెయిన్‌గన్ కొనుగోలులో 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.