: క్రీడలకు నిమ్మగడ్డ దన్ను!... గోపీచంద్ తో పాటు సాక్షికి బీఎండబ్ల్యూ కార్లిచ్చింది ఆయనేనట!


తెలుగు నేలలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన నిమ్మగడ్డ ప్రసాద్... క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాదులోని బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడెమీ అభివృద్దికి ఏకంగా రూ.5 కోట్ల మేర సాయం చేసిన నిమ్మగడ్డ... ఆ అకాడెమీలో అంతర్జాతీయ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేందుకు దోహదపడ్డారు. తాజాగా బ్యాడ్మింటన్ లో స్టార్ షట్లర్ పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు మూల కారకుడైన పుల్లెల గోపీచంద్ కు ఆయన ఓ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారును నిన్న హైదరాబాదు వచ్చిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అందజేశారు. ఇదే కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేత దీపా కర్మాకర్ కు కూడా తెల్లరంగులో ఉన్న ఓ బీఎండబ్ల్యూ కారు అందింది. ఈ కారును కూడా నిమ్మగడ్డనే బహుమతిగా అందజేశారు. నిన్న తన కూతురు వివాహం ఉన్న నేపథ్యంలో లక్షల ఖరీదు చేసే కార్లను క్రీడాకారులకు బహుమానంగా ఇస్తున్నా... ప్రజెంటేషన్ కార్యక్రమానికి మాత్రం ఆయన దూరంగానే ఉండిపోయారు.

  • Loading...

More Telugu News