: అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4 గా నమోదు
అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదయినట్లు అమెరికా భూ వైజ్ఞానిక సర్వేక్షణ అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.