: ఫేస్ బుక్ లో తన 'ఫీట్'ను లైవ్ చూపుతూ మరణించిన వింగ్ సూట్ పైలట్


తన సాహసోపేతమైన 'ఫీట్' ను ఫేస్ బుక్ లో లైవ్ గా చూపించాలన్న ఆ సాహసవంతుడు దురదృష్టకర పరిస్థితిలో ప్రాణాలు వదిలాడు. వందల మంది చూస్తుండగా, ఆల్ప్స్ పర్వతాలపై నుంచి దూకిన 28 ఏళ్ల ఇటాలియన్ వింగ్ సూట్ పైలట్ అర్మిన్ స్కిమిడర్, తన ఫ్యాన్స్ తో 'నేడు నాతో పాటు మీరూ ఎగురుతారు' అన్న మాటలే అతని ఆఖరి మాటలయ్యాయి. చూస్తున్న వారిని కన్నీళ్లు పెట్టించిన ఈ వీడియోలో అర్మిన్ దూకిన తరువాత కాసేపటికి ఓ పెద్ద ఆర్తనాదం వినిపిస్తోంది. నేలపై ల్యాండింగ్ సమయంలో జరిగిన పొరపాటు కారణంగానే అర్మిన్ మరణించినట్టు సమాచారం. ఈ నెలారంభంలో ఓ బ్రిటీష్ జంపర్ సైతం స్విట్జర్లాండ్ పర్వతాల్లో ఇదే విధమైన జంప్ చేసి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News