: మాదాపూర్ లో కూలిన నిర్మాణంలోని భవనం... నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాదు పరిధిలోని మాదాపూర్ లో నేటి ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి పేకమేడలా కుప్పకూలిపోయింది. నిర్మాణంలో నాసిరకం పనుల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ కక్కుర్తి, పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాదిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి వారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.