: ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’గా తెలంగాణ!... వరుసగా రెండో ఏడాది సీఎన్ఎన్- ఐబీఎన్ అవార్డు!


రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు దేశీయంగా సత్తా చాటుతున్నాయి. కొత్త రాష్ట్రం తెలంగాణ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలోనే ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డుకు ఎంపికైంది. నేషనల్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్ 11 ఏళ్లుగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వ్యక్తులు, రాష్ట్రాలకు అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది అవార్డుల్లో భాగంగా తెలంగాణ ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’గా అవార్డు దక్కించుకుంది. తాజాగా ఈ ఏడాది కూడా తెలంగాణ అదే అవార్డును కైవసం చేసుకుంది. ఈ మేరకు సీఎన్ఎన్-ఐబీఎన్ నిన్న అవార్డులను ప్రకటించింది. ఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News