: ప్రధాని నోట రిటైర్డ్ టీచర్ మాట.. ‘ఉజ్వల’ కోసం రూ.50వేలు విరాళంగా ఇచ్చారని ప్రశంస!


మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ‘ఉజ్వల’ పథకానికి ఓ రిటైర్డ్ టీచర్ రూ.50వేల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెబుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ ‘‘నేనో రిటైర్డ్ టీచర్‌ను. 90 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా. దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలనుకుంటున్న పథకం కోసం నా వంతుగా రూ.50 వేలు పంపిస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారని మోదీ వివరించారు. అయితే ఆమె ఏ ప్రాంతం వారు అన్న విషయాన్ని మాత్రం ప్రధాని పేర్కొనలేదు.

  • Loading...

More Telugu News