: తొమ్మిదో తరగతిలో లెక్కల్లో తప్పాను.. లెక్కలంటే నాకు మహా చికాకు: యువహీరో అల్లు శిరీష్


చెన్నైలో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు తాను లెక్కల పరీక్షల్లో తప్పానని యువహీరో అల్లు శిరీష్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘తొమ్మిదో తరగతి లెక్కల పరీక్షల్లో తప్పినప్పుడు అదే పాఠశాలలో మళ్లీ చదవాలంటే అదే క్లాసులో చేరమన్నారు. బయటకు వెళ్లిపోతానంటే, ‘పాస్’ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అదే సమయంలో, మా ఫ్యామిలీ హైదరాబాద్ కు మారాలనుకున్నాము. దీంతో, ‘పాస్’ సర్టిఫికెట్ తీసుకున్నాము. లెక్కలంటే నాకు చాలా చికాకు’ అని శిరీష్ చెప్పాడు. బన్నీ, తాను ఫ్రెండ్లీ గా ఉంటామని, తనకు కెమెరాలు, సెల్ ఫోన్లు అంటే బాగా ఇష్టమని శిరీష్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News