: ప్రధాని మోదీని కలిసిన ‘రియో’ పతక విజేతలు
రియో ఒలిపింక్స్ లో పతకాలు సాధించిన పీవీ సింధు, సాక్షి మాలిక్, కోచ్ పుల్లెల గోపీ చంద్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ లు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంలో ఈరోజు వారు కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని అభినందించారు. కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, పుల్లెల గోపీచంద్ లు ఈ రోజు హైదరాబాదులో బీఎండబ్ల్యు కార్లు అందుకున్న సంగతి విదితమే!