: ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్ ను అభినందిస్తున్నా: సీఎం చంద్రబాబు
ప్రత్యేకహోదాపై మాట్లాడిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయమై తాను కేంద్రానికి భయపడాల్సిన అవసరం లేదని, ఈ హోదా సాధించే వరకు పోరాటం చేస్తానని అన్నారు. ‘నా జీవితంలో వెనుదిరిగే ప్రసక్తే లేదు. ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరాటం చేస్తున్నా.. అంతకు మించి ఏమీ చేయలేము’ అని చంద్రబాబు అన్నారు.