: ‘జనతా గ్యారేజ్’ను ఒక సినిమాగా చూడకండి: ఎన్టీఆర్
ప్రకృతి కూడా మనలో ఒక భాగమవ్వాలని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీర్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనకు తెలిసో తెలియకో సిటీల్లో ఉండటం వల్ల ఒక కాంక్రీట్ జంగిల్లో ఉండిపోతున్నాము. ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా ఒక గ్రీన్ రివల్యూషన్ తీసుకురావచ్చు. ప్రకృతి గురించి ఒకళ్లు చెబితే మనకు అర్థం కాదు. మనకు మనంగా ఫీలవ్వాలి.. మన బాధ్యతగా ఫీలవ్వాలి. ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని ఒక సినిమాగా కాకుండా ఒక నైతిక బాధ్యతగా ప్రతిఒక్కరూ తీసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మొక్కలు నాటే విషయంలో అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి’ అని ఎన్టీఆర్ అన్నాడు.