: హైదరాబాదు చేరిన మాస్టర్ బ్లాస్టర్!... నేరుగా పుల్లెల గోపీచంద్ అకాడెమీకి సచిన్!
ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. ముంబై నుంచి నేటి ఉదయమే బయలుదేరిన సచిన్ కాసేపటి క్రితం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న క్రీడా ప్రముఖుడు చాముండేశ్వరీనాధ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శంషాబాదు విమానాశ్రయం నుంచి సచిన్ నేరుగా పుల్లెల గోపీచంద్ అకాడెమీకి బయలుదేరారు. రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లు కూడా ఇప్పటికే అకాడెమీకి చేరుకున్నారు. వీరు ముగ్గురితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహూకరించనున్నారు.