: బంజారా హిల్స్ లో హిట్ అండ్ రన్!... బెంజ్ కారు ఢీకొని బైకిస్ట్ దుర్మరణం!
హైదరాబాదులోని సంపన్నుల నివాస ప్రాంతంగా పేరుగాంచిన బంజారా హిల్స్ లో నేటి తెల్లవారుజామున హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మద్యం మత్తు తలకెక్కిన ఓ ప్రముఖుడు ఖరీదైన బెంజ్ కారుతో రోడ్డెక్కాడు. ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ బంజారా హిల్స్ రోడ్ నెంబరు-7 లోకి ఎంటరయ్యాడు. అటుగా వచ్చిన ఓ బైక్ ను బలంగా గుద్దేశాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని సాంతం గమనించిన బెంజ్ కారులోని వ్యక్తి... ఏమాత్రం మానవత్వం లేకుండా కారుతో సహా పరారయ్యాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బైక్ ను ఢీకొట్టిన కారు ఎవరిది, అందులోని ప్రముఖుడు ఎవరన్న విషయాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.