: ఇస్రో చరిత్రలో మరో విజయం!... ఏటీవీ ప్రయోగం సక్సెస్!


భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చరిత్రలో మరో విజయం నమోదైంది. నేటి ఉదయం సరిగ్గా 6 గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఇస్రో ప్రయోగించిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ గా పిలుస్తున్న ఈ రాకెట్... స్క్రాంజెట్ మోటార్ ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాతావరణంలోని గాలిని వాడుకుంటూ ప్రయాణం కొనసాగించే ఈ కొత్త తరహా రాకెట్ ప్రయోగం విజయంతో అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కీలక విజయాన్ని నమోదు చేసినట్టయింది. పునర్వినియోగ రాకెట్, తక్కువ బరువు కలిగిన రాకెట్ల ప్రయోగంలో ఈ విజయం మరింత వెసులుబాటు కల్పించనుంది.

  • Loading...

More Telugu News