: తన మాట వినని పిల్లలతో నయీం పచ్చిమిర్చి జ్యూస్ తాగించేవాడు!: కీలక విషయాలు వెల్లడించిన ఫర్హానా


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక విషయాలను వంట మనిషి ఫర్హానా పోలీసులకు వెల్లడించింది. భర్త మరణించడంతో తాను నయీం వద్ద వంటమనిషిగా చేరానని ఆమె చెప్పింది. నయీం కు హైదరాబాదు, నల్గొండ, భువనగిరి, ఛత్తీస్ గఢ్, గోవా, వైజాగ్, ఒంగోలు, అనంతపురం, రాయ్ పూర్ లలో భూములు, ఇళ్లు, ఆస్తులు ఉన్నాయని ఆమె వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో తన ఆస్తులను రక్షించుకోవడానికి, వాటిని పెంచుకునేందుకు, దందా చేసేందుకు వెళ్లేవాడని, అలా వెళ్లిన ప్రతిసారి తమను రక్షణగా తీసుకెళ్లేవాడని ఆమె తెలిపింది. తన ఎదుటే పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడేవాడని ఆమె వెల్లడించింది. నయీం చేసిన పలు హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆమె స్పష్టం చేసింది. నెలలో 20 రోజుల పాటు నయీం గోవాలోని కోకోనట్ గా పిలుచుకునే గెస్టు హౌస్ లో ఎంజాయ్ చేసేవాడని, గోవా వెళ్లిన ప్రతిసారీ అమ్మాయిలను తీసుకెళ్లి అరాచకాలు చేసేవాడని ఆమె చెప్పారు. బావ నదీంను గోవాలోనే నయీం అత్యంత కిరాతకంగా చంపాడని ఆమె వెల్లడించారు. గగన్ పాల్ లోని ఇంట్లోనే నస్రీన్ ను నయీం కుటుంబ సభ్యులు కొట్టి చంపారని ఆమె చెప్పింది. నయీం బాధలు భరించలేకే సదా, శామి, నవీలు మిస్సయ్యారని ఆమె తెలిపింది. తన మాటలు వినని పిల్లలతో నయీం పచ్చిమిర్చి జ్యూస్ తాగించేవాడని ఆమె వెల్లడించింది. నయీం అరచకాలు బయటపెడితే తన పిల్లలను చంపేస్తానని బెదింరించాడని, అందుకే తాను నోరుమెదపలేదని ఆమె తెలిపింది. తన పిల్లలను నయీం విచక్షణా రహితంగా కొట్టడంతో వాళ్లు నడవలేని స్థితిలో ఉన్నారని ఆమె చెప్పింది. నయీం అరాచకాలన్నింటికీ అతని తల్లి, అత్త, సోదరి, భార్య సహకరించేవారని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News