: మన ఇద్దరిదీ ఒకటే పరిస్థితి...అమ్మ లోటు మనిద్దరం ఫీలవుతున్నాం: తల్లిలేని పిల్లాడిని ఓదార్చుతూ బ్రిటన్ రాకుమారుడి ఆవేదన
తల్లి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని బ్రిటన్ రాకుమారుడు విలియమ్ తెలిపారు. తూర్పు ఇంగ్లండ్ లోని ఓ పిల్లల సంరక్షణాలయాన్ని భార్య, పిల్లలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేన్సర్ తో పోరాడుతూ మృతి చెందిన మహిళ కుమారుడిని ఓదార్చుతూ, తల్లి లేని బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. 'నీలాగే నాకు కూడా అమ్మ ప్రతి రోజూ గుర్తుకొస్తుంటుంది. ఆమె మరణించి 20 ఏళ్లు అయినా నేను ఇంకా ఆమెను మిస్ అవుతున్నాను. అమ్మను మిస్సవుతున్నానని నువ్వు బాధపడడంలో తప్పులేదు. అయితే ఈ బాధను కుటుంబ సభ్యులతో పంచుకో' అని ఆయన సూచించారు.