: ఫేస్ బుక్ లేకుంటే ఉద్యోగమే వద్దట
పైత్యం ముదిరి వెర్రితలలు వేయడం అంటే బహుశా ఇదే కాబోలు. సరదాకు, టైంపాస్ సంభాషణలకు ఉపయోగపడాల్సిన సామాజిక నెట్‌వర్క్ ఫేస్‌బుక్.. ఉద్యోగుల్లో అతివాద ధోరణులు పెరగడానికి కూడా కారణం అవుతోంది. వ్యసనంలా మారుతోంది. ఎంతగా అంటే.. ఫేస్ బుక్ అనుమతించని సంస్థల్లో తమకు ఉద్యోగమే అక్కర్లేదని అమెరికాలోని కుర్రకారు అంటున్నారట.
అక్కడి ఉద్యోగులు ఆఫీసుల్లో ఫేస్‌బుక్ చూడడం అనేది తమ హక్కుగా భావిస్తున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. అమెరికా కెనడాల్లో ఫేస్‌బుక్ ప్రభావంపై సర్వే నిర్వహించారు. మూడోవంతు ఉద్యోగులు రోజుకు కనీసం గంట సోషల్ నెటవర్క్ సైట్లలో గడుపుతున్నారట. నాలుగోవంతు ఉద్యోగులైతే.. ఫేస్‌బుక్ లేకపోతే ఉద్యోగమే వద్దు అంటున్నారట. ఈ వెర్రి ఇంకా ఎన్ని విపరిణామాలకు దారితీస్తుందో గానీ.. ఈ అధ్యయనం వివరాల్ని బిజినెస్ న్యూస్ డెయిలీ ప్రచురించింది.