: నేను అల్పుడిని... పవన్ కల్యాణ్ స్థాయికి తగను: ముద్రగడ పద్మనాభం


పవన్ కల్యాణ్ తో పోలిస్తే తాను అల్పుడినని, అతని స్థాయికి తగనని, నేడు తిరుపతిలో పవన్ సభ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ సభపై తాను స్పందించబోనని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చే సమయం ఆసన్నమైందని చెప్పిన ముద్రగడ, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాబు ముందడుగు వేయకుంటే మరింత ఉద్ధృతంగా ఉద్యమానికి కాపు లోకం సిద్ధమవుతుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News