: గుజరాత్‌లో భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనం
హిమాచల్‌ప్రదేశ్‌లో ఈరోజు ఉదయం స్వల్ప కాలవ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. కొద్ది సేపటిక్రితం గుజరాత్‌లోనూ భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేల్‌పై 3.8 తీవ్రతతో రాష్ట్రంలోని పోరుబందర్, జునాగఢ్, కచ్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భయపడిపోయిన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. భూప్రకంపనలతో ఆందోళనలకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.