: నిర్దయ భారతావనికి నిదర్శనం, దేశాకృతిలో భార్య మృతదేహాన్ని మోసుకు వెళుతున్న వ్యక్తి దృశ్యం వైరల్... మీరూ చూడండి!


అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామని చెప్పుకునే భారతావనిలో పేదలు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలు ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో తెలియజేస్తున్న ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులేని స్థితిలో శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే వ్యక్తి చిత్రాన్ని ఓ చిత్రకారుడు భారతదేశాకృతిలో చిత్రీకరించి తన ఆవేదన తెలియజేశాడు. ఇప్పుడు ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మనల్ని మనమే ప్రశ్నించుకుంటున్న వైనాన్ని కలిగిస్తోంది. ఆ చిత్రం ఇదే!

  • Loading...

More Telugu News