: అమరావతి కాదు 'భ్రమరావతి' అంటూ ప్రత్యేక బుక్ విడుదల చేసిన ఉండవల్లి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెబుతున్న ప్రతి మాటా అబద్ధమేనని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అమరావతిపై తాను రాసిన 'భ్రమరావతి' బుక్ లెట్ ను ఈ ఉదయం విడుదల చేసిన ఆయన ప్రసంగించారు. అనేక వివాదాలకు అమరావతి కేంద్ర బిందువు అయిందని ఆయన అన్నారు. కేంద్ర కమిటీ రాజధాని నిర్మాణంపై సిఫార్సులు ఇవ్వకముందే నిర్మాణాలు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తాను అనేక వర్గాలు, సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ బుక్ లెట్ తయారు చేశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సుల మేరకు రాజధానిని నిర్మించుకోవాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, దాన్ని పాటించకుంటే కేంద్రం నుంచి నిధులే రావని ఉండవల్లి అన్నారు. కేంద్ర నిధులతో క్యాపిటల్ నిర్మించాల్సి వుందని గుర్తు చేశారు. అసలు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనెలా పెడతారని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.