: రామాలయం గురించి మాట్లాడితే చంపేస్తాం: సాధ్వీ ప్రాచీకి ఐఎస్ఐ బెదిరింపు
అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మరోసారి మాట్లాడితే హత్య చేస్తామని ఐఎస్ఐ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చినట్టు విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తనకు ఇటువంటి కాల్స్ వచ్చాయని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. గురువారం రాత్రి ఈ ఫోన్ వచ్చిందని, తనను ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజంట్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించగానే "ఐ లవ్ మై కంట్రీ" అని తాను చెప్పానని, "అయితే మరణించేందుకు సిద్ధంగా ఉండు" అంటూ ఫోన్ పెట్టేశాడని సాధ్వి ప్రాచి వెల్లడించారు. ఈ బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా రామాలయం గురించి మాట్లాడుతూనే ఉంటానని అన్నారు.