: సీబీఐ ఆఫీసుకు వెళ్లి భర్త గురించి అడిగి అవాక్కైన యువతి!


తన జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే పోలీసు అధికారిని మాత్రమే చేసుకోవాలని కలలు గన్న ఆ యువతి కలలు కల్లలయ్యాయి. సీబీఐ ఆఫీసర్ ను అని చెప్పి మోసం చేసిన యువకుడితో మూడు ముళ్లు వేయించుకుని, ఆపై విషయం తెలిసి ఆలోచనలో పడి, అతడికి తగిన శిక్ష వేయించాలనే నిర్ణయించుకుంది. ఈ ఘటన చెన్నై పరిధిలోని అన్నాశాలైలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆటోమొబైల్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రవీణ్ రావుకు, కార్ రెంటల్ కంపెనీ ఉద్యోగిని విద్య పరిచయం అయింది. మాటల మధ్యలో తాను పోలీసును వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు విద్య చెప్పగా, తాను సీబీఐలో పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుందామా? అని ప్రవీణ్ అడిగాడు. ఈ ప్రపోజల్ కు సంతోషంగా విద్య ఒప్పుకోగా, గత నెల 10న వడపళని దేవాలయంలో వివాహం జరిగింది. అయితే, నెల రోజుల కాపురం తరువాత భర్త ఉద్యోగంపై విద్యకు అనుమానం వచ్చింది. చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి వివరాలు అడగగా, అప్పుడు అసలు విషయం తెలిసింది. తొలుత తన జీవితం నాశనమైందని బాధపడ్డ ఆమె, మోసం చేసిన వాడికి శిక్ష పడాల్సిందేనని, సర్దుకుపోయేది లేదని నిర్ణయించుకుంది. ఆపై ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన చేసిన పోలీసులు, అతని నుంచి సీబీఐ నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News