: నయీమ్ ఎన్ కౌంటర్ బూటకం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదలం: క్రాంతిసేన సంచలన ప్రకటన


"ఎమ్మెల్యేలతో చర్చలున్నాయి రావాలంటూ, నయీమ్ తో సంబంధాలున్న ఒక డీఎస్పీ ద్వారా పిలిపించి నయీమ్ ను కాల్చి చంపారు. మాకున్న నెట్ వర్క్ ను ఉపయోగించుకుని నక్సల్స్ ను ఏరివేసిన పోలీసులు చివరికి మా నేతనే లక్ష్యంగా చేసుకుని చంపారు" అని క్రాంతిసేన సెంట్రల్ కమిటీ పేరిట సంచలన ప్రకటన మీడియాకు విడుదలైంది. నయీమ్ మరణించిన మూడు వారాల తరువాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నందునే నయీమ్ ను హత్య చేశారని, ఇది బూటకపు ఎన్ కౌంటరని క్రాంతిసేన మహారాష్ట్ర, ఒడిశా సెంట్రల్ కమిటీ సభ్యులు మధు, జగత్ పట్నాయక్ ల పేరిట ఈ ప్రకటన విడుదలైంది. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు గెలిచేందుకు నిధులు కూడా ఇచ్చామని, ఇప్పుడిక తెరాస ఎమ్మెల్యేలను వదిలి పెట్టబోమని హెచ్చరించారు. నయీమ్ గ్యాంగ్ స్టర్ కాదని, మావోయిస్టు, ఉగ్రవాద వ్యతిరేక పంథాలో పయనించాడని, ధనికులను లక్ష్యంగా చేసుకుని వారి సంపదను పేదలకు పంచాడని వీరు అన్నారు.

  • Loading...

More Telugu News