: హమ్మయ్య... సాక్షి నాతో కుస్తీ పట్టలేదు: సెహ్వాగ్


రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కలిసింది. స్వతహాగా సెహ్వాగ్ కు వీరాభిమాని అయిన సాక్షి, పతకం గెలిచిన తరువాత "మిమ్మల్ని కలవాలని ఉంది. వీలైతే చెప్పండి" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా "తప్పకుండా కలుద్దాం. కలసిన తరువాత నాతో కుస్తీ పడరుగా?" అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఇండియా వచ్చిన తరువాత సెహ్వాగ్ ఆహ్వానం మేరకు సాక్షి ఆయన్ను కలిసింది. ఆమెతో ఫోటో దిగిన సెహ్వాగ్, దాన్ని ట్విట్టర్ ఖాతాలో పెడుతూ "సాక్షిని కలవడం ఆనందంగా ఉంది. తను నాతో కుస్తీ పోటీకి దిగలేదు. హమ్మయ్య... ఇబ్బందులు పడకుండా అభినందించి పంపాను" అంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News