: పానీపూరి గొడవ ఒకరి ప్రాణాలు తీసింది
ఢిల్లీలో పానీపూరి కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఈ నెల 4న ఇర్ఫాన్ అనే వ్యక్తి ఢిల్లీలోని భలస్వా డౌరీ ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం సమీపంలో ఉన్న పానీపూరి సెంటర్ కు వచ్చాడు. అతను వచ్చిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. ఇర్పాన్ కంటే ముందుగా తమకే పానీపూరీ ఇవ్వాలంటూ గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు వ్యక్తులకు, ఇర్ఫాన్ కు మధ్య తలెత్తిన వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇర్ఫాన్ ను వారు తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారం లభించింది. నిందితులు సునీల్ కుమార్, లక్కీల ను పోలీసులు అరెస్టు చేశారు.