: 28న ఏటీవీని ప్రయోగించనున్న ఇస్రో


ఈ నెల 28వ తేదీన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెహికల్ (ఏటీవీ)ని ఇస్రో ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లాలో ని షార్ నుంచి ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగానికి 6 గంటల ముందు నుంచి అంటే శనివారం అర్ధరాత్రి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో షార్ రేపు ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, వాతావరణంలోని ఆక్సిజన్ ను వాడుకొంటూ రోదసీలోకి వెళ్లే రాకెట్లను తయారు చేసుకోవాలనేది ఇస్రో ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఏటీవీని ప్రయోగించనున్నారు.

  • Loading...

More Telugu News