: యూపీలో కొనసాగుతున్న వలసలు...బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
ఉత్తరప్రదేశ్ లో వలసలు ఆగడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వలసలు జోరందుకుంటున్నాయి. అభ్యర్థులను ప్రకటించేంత వరకు ఈ వలసలు ఆగేలా కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దఎత్తున బీజేపీలో చేరారు. కాగా, దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఆశావహులు పార్టీల్లో స్థానాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అనుకూలమైన పార్టీ, గెలిచే అవకాశాలున్న పార్టీల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అక్కడ జంప్ జిలానీలు పెరుగుతున్నారు.