: మీ ఫోటో మీ మూడ్‌ను చెప్పేస్తుంది


'మూడ్‌ బాగోలేదా' అని మీ మిత్రులు గానీ, శ్రీమతి గానీ పలకరించినప్పుడు.. 'అబ్బే అలాంటిదేం లేదే' అంటూ బుకాయించడానికి మీకిక అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఫోటోను చూసి.. సదరు వ్యక్తి ఫోటో దిగిన సమయంలో ఎలాంటి మూడ్‌లో ఉన్నాడో పసిగట్టి చెప్పేసే ఒక సాఫ్ట్‌వేర్‌ను భారతీయ సంతతికి చెందిన ఇంజినీరు అభివన్‌ దాల్‌ అభివృద్ధి చేశారు. ఫోటో తీయించుకునే సమయంలో వ్యక్తి ఎలాంటి మూడ్‌లో ఉన్నాడో ఈ సాఫ్ట్‌వేర్‌ చెప్పేస్తుందిట.

కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన అభివన్‌ సాఫ్ట్‌వేర్‌... ఫోటోల్లో మూడ్‌ను గుర్తించి వాటికి మార్కులు కూడా వేస్తుందిట. ఈ వివరాలను న్యూ సైంటిస్ట్‌ మేగజైన్‌ వెల్లడించింది. అల్గారిథం గణన ఆధారంగా రూపొందిన ఈ సాఫ్ట్‌వేర్‌.. మనిషి చిత్తరువును బట్టి కళ్లు, బుగ్గలు, పెదాల అంచులు ఉన్న భంగిమను బట్టి వ్యక్తి మూడ్‌ను అంచనా వేస్తుందిట.

  • Loading...

More Telugu News